TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ‘కొత్త పార్టీ’ అంశంపై ఆమె సోదరుడు, మాజీమంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ‘కుటుంబ సభ్యులను కవిత ఏడిపించేలా వ్యవహరిస్తున్నారు. కన్నవారికి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు. కానీ, వారు బాధపడే పనులు మాత్రం చేయకూడదు. కవిత ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’ అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.