టెలిఫోన్ పితామహుడు అలెగ్జాండర్ గ్రాహంబెల్ 179వ జయంతి నేడు. 1847లో జన్మించిన ఆయన, 1876లో టెలిఫోన్‌ను ఆవిష్కరించి మానవ చరిత్రలో కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికారు. తన తల్లి, భార్య ఇద్దరికీ వినికిడి లోపం ఉండటమే ఆయన్ని శబ్ద తరంగాలపై ప్రయోగాలు చేసేలా పురికొల్పింది. ఫోన్‌తో పాటు మెటల్ డిటెక్టర్, ఫోటోఫోన్ ఆవిష్కరణల్లోనూ ఆయన పాత్ర కీలకం.