AP: నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్లో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ విషప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులుకు వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం,అలసత్వం,అవినీతితో రాష్ట్రం వెనకబడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులు, పరిశ్రమలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.