TG: రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతలా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పొంగులేటి అవినీతిని సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారని తెలిపారు. నాలుగు శాఖలు విచారణ జరిపి నోటీసులు ఇచ్చినా.. మంత్రి సంబంధం లేదంటున్నారని మండిపడ్డారు. పొంగులేటి పొగరు తగ్గించుకోవాలని.. ఆయన అక్రమాలు ఇంకా బయటపెడతామని హెచ్చరించారు.