TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం కలకలం రేపుతోంది. చింతలగుంపు ప్రాంతంలో పులి అడుగులను అటవీశాఖ అధికారులు తాజాగా గుర్తించారు. పులి కదలికలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.