TG: ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై కేంద్రమంత్రి బండిసంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. తడిచిన ధాన్యాన్ని ఎటువంటి కొతలు లేకుండా కొనాలి. కేంద్రం నిధులు ఇచ్చినా ఆరోపిస్తున్నారు. వారి చేతకాని తనాన్ని కేంద్రంపై రుద్దుతున్నారు. ప్రతీ రైతుకు తెలుసు కేంద్రం నిధులు ఇస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తి మాత్రమే’ అని తెలిపారు.