AP: ప్రముఖ కవి నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకోవడంపై మాజీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ‘సాహిత్య రంగంలో జాతీయ స్థాయి అత్యున్నతమైన పురస్కారం లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేశారు. తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారు’ అంటూ ప్రశంసించారు.