TG: మహిళా రిజర్వేషన్.. పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి సాయపడుతుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు ఆమె సూచించారు. ఈ రిజర్వేషన్ల ద్వారా చట్టసభల్లో మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయని, దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని ఆమె అన్నారు.