AP: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. పేద విద్యార్థులకు భోజనం పెట్టడంపై గరికపాటికి ఎందుకు బాధ అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.