TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో లోక్సభ స్పీకర్ తీరు సరికాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ‘స్పీకర్ తీరుపై సభలో చర్చకు డిమాండ్ చేస్తున్నాం. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా.. స్పీకర్ సమానంగా వ్యవహరించాలి. రాహుల్కు మాట్లాడేందుకు అవకాశం ఇస్తూనే.. వెంటనే సభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. స్పీకర్ సమాధానం సంతృప్తిగా లేదు’ అని అన్నారు.