SRD: అమావాస్య సందర్భంగా సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని వేదమంత్రాలతో జరిపించారు. భక్తులే స్వయంగా శివలింగానికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు.