కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను శనివారం ఆత్కూరు పోలీసులు విచారించనున్నారు. గతంలో ఆత్కూరు సమీపంలో కొందరి వ్యక్తులను బెదిరించి వారి భూమిని లాక్కున్నారని కేసు నమోదు కావడంతో పోలీసులు వంశీని విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం వంశీని పోలీసులు ప్రశ్నించనున్నారు.