TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురికి ఉప్పరపల్లి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. మాజీ MLA రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో నేటి నుంచి 3 రోజుల పాటు సిట్ అధికారులు వారిని విచారించనున్నారు. ఈ ముగ్గురిని విచారించడం ద్వారా డ్రగ్స్ నెట్వర్క్ మూలాలను, సరఫరాదారుల వివరాలను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.