AP: P3తో సంపద సృష్టిస్తున్నాము కానీ ఆర్థిక అసమానతలు తగ్గించలేకపోతున్నామని CM చంద్రబాబు అన్నారు. ‘పీ4తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. దీంతో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. 2047 నాటికి భారత్ అగ్రదేశంగా తయారవుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు ఉండొద్దని ఈ ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 90 శాతం విజయాన్ని మనకు అందించిన ప్రజల కోసం మనం కృషి చేయాలి’ అని తెలిపారు.