లడాఖ్ సరిహద్దు వివాదంపై ఇరుదేశాల ఉన్నతాధికారులు జరిపిన చర్చల్లో భారత్-చైనాలు ఓ ఒప్పందానికి వచ్చాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. సరిహద్దులో పెట్రోలింగ్ పునఃప్రారంభానికి ఇరు దేశాలు అంగీకారం తెలిపాయని వెల్లడించింది. రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొననున్న నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ బ్రిక్స్కు భారత్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని పేర్కొన్నారు.