కృష్ణా: ఆగిరిపల్లి గ్రామంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అమరులైన పోలీసు సిబ్బంది చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శుభ శేఖర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు నేటి యువ పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు.