SDPT: గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సోమవారం నల్ల నువ్వులతో 6 అడుగుల అమరవీరుల స్థూపంను చక్కగా రూపొందించారు. ఈరోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, తను నువ్వులతో తయారుచేసిన స్థూపాన్ని పోలీసు అమరవీరులకు అంకితమిస్తున్నట్లు రామకోటి తెలిపారు.