AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు HYD సిటీ సివిల్ కోర్టు సమన్లు పంపింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. పవన్‌తో పాటు తెలంగాణ సీఎస్‌కు కోర్టు సమన్లు పంపింది. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీనెయ్యి వాడినట్లు పవన్ వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.