GNTR: మంగళగిరి మండల విద్యాశాఖాధికారి -1 ఇంఛర్జిగా కే.శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి-2 ఎన్ బాబు, ఎంఆర్సీ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీనివాసరావు ప్రస్తుతం దుగ్గిరాల ఎంఈవోగా విధులు నిర్వహిస్తూ మంగళగిరి మండల విద్యాశాఖాధికారి -1గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.