BHPL: రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.