కృష్ణా: నూజివీడు పట్టణంలో కొత్త లైన్లు ఏర్పాటు నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఏపీ సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ తెలిపారు. నూజివీడులో ఆయన సోమవారం రాత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, బంగినపల్లి తోటలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు.