GNTR: బాణాసంచా విక్రయాలకు సింగిల్ విండో విధానం ద్వారా లైసెన్స్లు జారీ చేస్తున్నామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు మాత్రమే షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ మేరకు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వివిధ మండలాలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలందరూ దీపావళి సంతోషంగా జరుపుకోవాలన్నారు.