AKP: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం నర్సీపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పాఠశాలల ప్రహరీ గోడల కోసం ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి మూడు మండలాలకు గాను 29 పనుల కోసం మూడు కోట్ల 82 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.