ASR: అరకులోయ మండల పంచాయితీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో ఎంపీడీవో లవరాజు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు శానిటేషన్, త్రాగునీరు, SWPC షెడ్ల ప్రగతి పై చర్చించి, పురోగతికి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. అంగన్వాడీ, MSKలపై ప్రతి వారం మాట్లాడదామని ముందుగా వాటిపై రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఎంఈవో, సీడీపీవో, ఏఈ, ఏపీవో ఉన్నారు.