మలయాళ కుట్టి మాళవిక కృష్ణదాస్ త్వరలో తల్లికాబోతుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి మెటర్నిటీ ఫొటో షూట్ చేసుకున్న ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈమె 2023లో ‘నాయికా నాయకన్’ కో కంటెస్టెంట్ తేజస్ జ్యోతిని వివాహం చేసుకుంది. మాళవిక టీవీ సీరియల్స్, టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా పాపులర్ అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాళవిక నటనతోపాటు, శాస్త్రీయ నృత్యంలో కూడా అనేక అవార్డులు గెలుచుకుంది.