వరుస బాంబు బెదిరింపులపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ సెక్యూరిటీ నిబంధనల్ని సవరిస్తామని తెలిపారు. అలాగే బాంబు బెదిరింపు పాల్పడే వారిని ఇకపై విమానంలో ప్రయాణించకుండా నో ఫ్లై లిస్ట్‌లో చేర్చుతామని ప్రకటించారు. బెదిరింపులకు పాల్పడటం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామన్నారు. ఇకపై ఇలాంటి బెదిరింపులను సున్నితమైన అంశంగా పరిగణించి.. వాటిని ఒక పద్ధతిలో పరిష్కరించాలని పేర్కొన్నారు.