TG: ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో నార్సింగి పోలీసులు హర్షసాయిని విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేశారు. కానీ అతను పరారీలో ఉన్నాడని తెలియడంతో.. పోలీసులు నాలుగు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే హర్షపై 376, 354, 328 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు.