KNR: కొత్తపల్లి బస్టాండ్ నుంచి రైల్వే బ్రిడ్జి వరకు రోడ్డు మరమ్మతలు పనులను 17వ, 18వ డివిజన్ల కార్పొరేటర్లు వేముల కవిత-చంద్రశేఖర్, వాసాల రమేశ్ ప్రారంభించారు. రోడ్డు మరమ్మతులతో ప్రయాణికులకు సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ స్వర్గం వజ్రదేవి-నర్సయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ పర్శరాములు, 17వ, 18వ డివిజన్ల వాసులు పాల్గొన్నారు.