దేశంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. దీనిని మైండ్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ (Congress party) ఒక వీడియో తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేసింది.. ఈ వీడియో నిడివి 1.43 నిమిషాల పాటూ ఉంటుంది. దీనికి రాజ్ కపూర్ (Raj Kapoor) పాటను జోడించి కొన్ని లిరిక్స్ ను మర్చి చిత్రీకరించారు. ఈ వీడియోలో ప్రస్తుత పాలకుల అవినీతి(Corruption)ని, అహంకారాన్ని, నిరంకుశత్వాన్ని, విద్వేశాన్ని, పత్రికల, ప్రజాస్వామ్య విలువల, బ్యూరోక్రసీల(Bureaucracies)ను బంధించి వాటి స్వేచ్ఛ హరించడాన్ని క్లుప్తంగా వివరించారు. ప్రధాని మోదీ తన గుర్రపు బండిపై మీడియా, బ్యూరోక్రసి, డెమోక్రసీ(Democracy)ని నిర్భంధించి తన రథం పై వేసుకొని వెళ్తున్నట్లు చూపిస్తారు.
అలా వెళ్తున్న మార్గాన్ని నఫ్రత్ కా బజార్ (Nafrat Ka Bazar) అని పేరు పెట్టారు. దీని అర్థం విద్వేశాలను రెచ్చగొట్టి అక్రమాలకు పాల్పడి రాజకీయ సింహాసనాన్ని అధిరోహించే పాలకులకు సంబంధించిన వర్తక ప్రదేశంగా చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్రోహ శక్తులన్నీ ఇక్కడ అందుబాటులో దొరుకుతాయని తెలిపారు. మోదీతో పాటూ అమిత్ షా(Amit Shah)ను కూడా ఈ వీడియోలో చూపించారు. హిందూ, ముస్లీంలకు మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే పాత్ర పోషించారు. ఇలా ఇరు పక్షాలు కొట్లడుకుంటున్న సమయంలో భారత్ జోడో యాత్ర కు సింబాలిక్ గా రాహూల్ గాంధీ (Rahul Gandhi) అడుగులను చూపిస్తారు. అలా చూపిన తరువాత కొట్లాడుకున్న వారికి మధ్య సఖ్యత కుదిరేలా ఈ నాయకుడు నడుంబిగించాడని ఒక పాట రూపంలో చూపించారు. ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇలా అందరినీ కలుపుకొని యాత్ర చేస్తున్న క్రమంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా నిర్వీర్యం చేశారో పత్రికల్లో ప్రచురితం అయిన వార్తలను చూపిస్తారు.
అక్రమంగా కేసులు పెట్టి, తనకు ఇచ్చిన అధికార నివాసాన్ని ఎలా ఖాళీ చేయించారో తెలిపారు. మోదీ, షా లు విభజించు, పాలించు అనే గ్రంధంలోని రూల్స్ చదువుకుంటూ ఉంటారు. వీరి కుట్రలను నిలువరించడం కోసం రాహూల్ పెద్ద లారీలో వచ్చి అక్రమాలు చేసే నఫ్రత్ కా బజార్ అనే బోర్డ్ ను కూల్చేస్తాడు. అలా ఆ బోర్డ్ (Board) కింద పడిపోయిన వెంటనే మొహబ్బత్ కే దుకాన్ అనే షాపు కనిపిస్తుంది. మొహబ్బత్ అంటే ప్రేమా, అనురాగాలు, ఆప్యాయతలు(Affections), విలువలు అని అర్థం. ఈ ప్రాంతంలో కొన్ని వికృత శక్తులు వచ్చి ఇక్కడ లభించే ప్రేమానురాగాలను కనుమరుగు చేశాయని వాటిని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాహూల్ గాంధీ వచ్చాడని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తన మార్క్ క్యాంపైన్ (Mark campaign) ని మొదలు పెట్టారని చెప్పాలి.