»Union Minister Nirmala Sitharaman Who Married A Daughter Simply At Bangalore
Nirmala Sitharaman: సింపుల్ గా బిడ్డ పెళ్లి చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె(Nirmala Sitharaman daughter) పరకాల వాజ్ఞయి పెళ్లి పీటలు ఎక్కారు. బెంగళూరులోని నివాసంలో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుకలు జరిగాయి. తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహం సాగింది.
రాజకీయ ప్రముఖుల ఇళ్లలో పెళ్లిళ్లు చేసుకోవడం మామూలు విషయం కాదు. భారీ సెట్టింగులు, కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా. రాజకీయ ప్రముఖులు, అధికారుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. కానీ, అందుకు భిన్నంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన కుమార్తె వాంగ్మయి వివాహాన్ని చాలా నిరాడంబరంగా నిర్వహించడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారు. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని ఆమె నివాసంలో వివాహ వేడుక జరిగింది.
సీతారామన్ కుమార్తె(daughter), పరకాల వంగమయి వివాహం(marriage) ప్రతీక్‌తో పెళ్లి చాలా సింపుల్ గా నిర్వహించారు. కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో నిర్మలా సీతారామన్ వివాహ వేడుక పూర్తయింది. ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలు ఎవరూ హాజరుకాలేదని సమాచారం. ఉడిపిలోని అడమారు మఠానికి చెందిన అర్చకులు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరిపించారు. వధువు వాంగ్మయి పింక్ చీర, ఆకుపచ్చ బ్లౌజ్ ధరించగా, వరుడు ప్రతీక్ తెల్లటి దుస్తులలో కనిపించాడు. ఈ వివాహానికి సంబంధించిన సమాచారాన్ని సీతారామన్ కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించలేదు. అయితే పెళ్లి సందర్భంగా తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(viral)గా మారాయి.
పరకాల ప్రభాకర్- నిర్మలా సీతారామన్ కుమార్తె వాజ్ఞయి వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఓ జాతీయ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తోన్నారు. ప్రత్యేకించి- ఆర్ట్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, సాహిత్యం మీద వార్తలను రాస్తుంటారు. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ఆమె. ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎంఏ చేశారు.