కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో గుండెపోటు కేసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఇండియాలోని 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పెద్దవారిలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలలో కొనసాగుతోందన్న ఆయన.. భారత్లో 2022లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల జనాభాలో గుండెపోటు సంఘటనలపై కొవిడ్ వ్యాక్సిన్(Cardiac arrest) ప్రభావాన్ని గుర్తించడానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులలో మరో మల్టీసెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోందన్నారు.
కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్పీ-ఎన్సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) హెల్త్ వెల్నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి తెలిపారు.కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్పీ-ఎన్సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి మన్సూక్ మాండవీయ (Mansook Mandaviya) వెల్లడించారు