Kia: దక్షిణ కొరియా కార్ల సంస్థ అయిన కియా మోటర్స్(Kia) సంస్థ అత్యాధునిక సంకేతికతో ADAS ఫిచర్లతో కియా మిడ్ సైజ్డ్ (SUV) సెల్టోస్ మోడల్ ను శుక్రవారం ఆవిష్కరించింది. ఈ వాహనం ఎక్స్‌లైట్, జీటీ లైన్, టెక్ లైన్ మూడు వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ రెండు పవర్ ట్రైన్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.10.89-19.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. గత వారంలోనే కొత్త సెల్టోస్ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించగా మొదటిరోజే 13,424 బుకింగ్‌లు జరిగినట్లు కంపెనీ తెలిపింది
కొత్త కియా సెల్టోస్‌లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS)-2లో అత్యంత భద్రతా ఫీచర్లు, ఆధునిక సాంకేతికతను అమర్చారు. డ్యుయల్ టోన్ వేరియంట్లుతో పాటు, ఎనిమిది ఆకర్షణీయమైన రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ కారును మూడు ఇంజిన్ వేరియంట్లలో తీసుకొచ్చారు. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోపాటు, ఐవీటీ గేర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక 1.5-లీటర్ డీజిల్ వేరియంట్ 6-స్పీడ్ ఐఎమ్‌టీ ట్రాన్స్‌మిషన్‌తో పాటు, 6-స్పీడ్ ఆటోగేర్ ట్రాన్స్‌మిషన్‌తో తీసుకొచ్చారు. ఈ మోడల్లో కొత్తగా 1.5-లీటర్ల పెట్రోల్ టీ-జీడీఐ ఇంజిన్ వేరియంట్‌ను పరిచయం చేశారు. ఇందులో 6-స్పీడ్ ఐఎమ్‌టీ గేర్, 6-స్పీడ్ ఆటోగేర్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.
ఇక ఎక్స్టీరియర్ పరంగా చూస్తే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ లైట్ బార్ ఇందులో ఉన్నాయి. 18 అంగుళాల క్రిస్టల్ కట్ గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్స్‌ను ఇస్తున్నారు. ఫాక్స్ డ్యుయల్ ఎగ్జాస్ట్ టిప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో వస్తోంది. కారు లోపల 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. ఇందులో కియా హోమ్ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్ ఫీచర్లు ఉన్నాయి.