HER Movie Review: హెర్ (హెచ్‌ఇఆర్) మూవీ రివ్యూ: హిట్టా.? ఫట్టా.?
క్రైమె థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో రూపొందించిన తాజా చిత్రం హెచ్‌ఇఆర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఏ మేరకు నచ్చిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Annapurna Photo Studio Review: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తో అందరిలో ఆసక్తిని రేపింది. ఈ లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్ర ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాద్ శివార్లలో జంట హత్యల జరగుతాయి. ఈ హత్యలను ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఏసీపీ అర్చనా ప్రసాద్ (రుహానీశర్మ) రంగంలోకి దిగుతుంది. పలు కోణాల్లో కేస్‌ని పరిశోధిస్తున్న క్రమంలో ఊహించని మలుపులు ఎదురౌతాయి. ఇంతకీ ఆ హత్యలు ఎవరు చేశారు? హంతకుల్ని పట్టుకునే క్రమంలో అర్చనకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? మరోవైపు ఆమె ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నిస్తుంటుంది?(HER movie review) తదితర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో సాగే కథ ఇది. క్రైమ్ ను నిమిషాల్లో పట్టుకునే టెక్నాలజీ నడుస్తున్న కాలంలో చాలా మంది నేరస్తులు ఇంకా తెలివిగా తప్పులు చేస్తున్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులకు చాలా సవాళ్లు ఎదురౌతున్నాయి. ఇలాంటి కథలే తెరపైకొస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి.(HER movie review) ఈ చిత్రం కూడా అలాంటి కథే ఇందులో లేడి క్యారెక్టర్ దర్యాప్తు చేయడం ప్రత్యేకత. సినిమా ప్రారంభ సన్నివేశాలు ప్రేక్షకుడిని నేరుగా కథలోకి తీసుకెళతాయి. ఆ తర్వాతే సినిమా గాడి తప్పుతుంది. కేసు పరిశోధనలోనే బలం లేదు. బాధితుల కుటుంబ సభ్యుల్ని, అనుమానితుల్ని కలిసి వివరాలు సేకరించే క్రమం సాగదీతగా అనిపిస్తుంది. సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్లు, సెల్‌ఫోన్ సిగ్నళ్లతో నేరగాళ్లని చిటికెలో కనిపెడుతున్న ఈ పరిస్థితుల్లో ఓ కేస్‌ని నిగ్గు తేల్చేందుకు ఇంత హంగామానా అనిపిస్తుంది. (HER movie review) ఇలాంటి నేపథ్యంలో… ఇంతకుమించిన మలుపులతో ఇదివరకు తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి.
ఎవరెలా చేశారు
హీరోయిన్ రుహానీశర్మ ఆకట్టుకుంది. పోలీస్ పాత్రలో ఆమె ఒదిగిపోంది. ఇక కథలో తానే మెయిన్ లీడ్ కాబట్టి తన నటనతో మెప్పించింది. ఫస్ట్ ఆఫ్‌లో కాస్త గ్లామర్ తో మెప్పించింది. జీవన్‌కుమార్ తనదైన నటనతోనూ, తన మార్క్ సంభాషణలతోనూ అక్కడక్కడా నవ్వించారు. ప్రదీప్ రుద్ర మరో పోలీస్ అధికారిగా కనిపించారు. (HER movie review) అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కెమెరా, సంగీతం, కూర్పు విభాగాలు చక్కటి పనితీరుని ప్రదర్శించాయి. నిడివి తక్కువ ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చింది. దర్శకుడు స్వరాఘవ్ మేకింగ్ మెప్పించినా, ఆయన రాసుకున్న కేసులోనే బలం లేదు. కొన్ని మలుపులున్నా అవి పెద్దగా థ్రిల్‌ని పంచలేవు.