What happened to the child's head stuck in the iron pillar?
Viral News: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్(Railway station)లో ఓ చిన్నారికి భారీ ప్రమాదం తప్పింది. ప్లాట్‌ఫామ్‌పై ఆడుకుంటుండగా చిన్నారి తల ఇనుప పిల్లర్(Iron pillar)లో ఇరుక్కుపోయింది. గంటపాటు ఆ పాప నరకయాతన అనుభవించింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఇనుప కట్టర్ల సాయంతో పిల్లర్‌ను కట్ చేసి పాపను సురక్షితంగా కాపాడారు.
రాజంపేట నుంచి చిత్తూరు వెళ్లేందుకు ఓ కుటుంబం రేణిగుంటకు వచ్చింది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగా చిన్నారి ఆడుకుంటూ వెళ్లి తెలియకుండా పక్కనే ఉన్న రెండు ఇనుప స్తంబాల మధ్యలో తల పెట్టింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా తల బయటకు రాలేదు. దీంతో ఆ చిన్నారి గంటపాటు నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. ఇక రైల్వే అధికారుల ఆ పిల్లర్ ను కట్ చేసి పాపను కాపాడారు. ప్రమాదం నుంచి బయటపడటంతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
చిన్నరాలును బయటకు తీసుకెళ్లినప్పుడు, లేదా ఏదో ప్రయాణాల నిమిత్తం రైల్వే స్టేషన్లు, బస్ స్టాపులకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు జాగ్రాత్తగా ఉండాలి. వారికి తెలియకుండా పరిగెత్తడము లేదా ఏదైన ప్రమాదకరమైన వాటిని పట్టుకోవడము చేస్తుంటారు. ఇక వర్షకాలంలో మ్యాన్ హోల్స్ విషయంలో కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.