»Supreme Court Said Candidates Contesting The Elections Can Hide The Details Of Assets In The Affidavit
Supreme Court: అఫిడవిటీలో చరాస్తి వివరాలు దాచొచ్చు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థలు అన్ని వివరాలను ఓటరు తెలుసుకోవాల్సన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కుటుంబానికి చెందిన చరాస్తులను అన్నింటిని పరిగణిలోకి తీసుకోలేమని వెల్లడించింది.
Supreme Court said Candidates contesting the elections can hide the details of assets in the affidavit
Supreme Court: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అన్ని చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఓటరు తెలుసుకోవాలని అది కచ్చితమైన హక్కేమీ కాదని పేర్కొంది. భారీ ఆస్తులు ఉండీ, విలాసవంతమైన జీవన శైలి ఉండే వారు తప్ప.. ఇతర అభ్యర్థులు ప్రతి కుటుంబ సభ్యుడి చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా కానీ పోటీ చేసే అభ్యర్థులు, అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు వారికి ఉందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కరిఖో ఎన్నికను సమర్థించింది. 2019 ఎన్నికల్లో ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించారు.
అయితే కరిఖో నామినేషన్లో తెలిపిన వివరాలు తప్పుగా చూపించాడని ఆయన ప్రత్యర్థి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కరిఖో తన నామినేషన్లో భార్య, కుమారుడికి చెందిన మూడు వాహనాల వివరాలను దాచి ఉంచాడని తెలిపారు. తన ఎన్నికను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కరిఖో నామినేషన్ వేయడానికి ముందే ఆ వాహనాలు గిఫ్ట్‌గా ఇవ్వడమో, విక్రయించడమో చేశారని కోర్టు గుర్తించంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని ఆ కుటుంబానికి చెందినవిగా పరిగణించలేమని పేర్కొంది. ఈ సందర్భంగా పిటిషనర్ అభ్యంతరాలను తోసివేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ గవాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసేంది. తాజాగా ఆయన ఎన్నిక సరైనదే అని తీర్పు వెల్లడించింది.