రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర ఢిల్లీలో సాగుతుంది. కాగా… ఈ యాత్రలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడగా… ఆయన పెళ్లి ప్రస్తావన రావడం గమనార్హం. తన పెళ్లి ప్రస్తావన రాగా… దానికి ఆయన నవ్వుతూ సమాధానం ఇవ్వడం గమనార్హం. తనకు ఎలాంటి అమ్మాయిలు ఇష్టమో స్వయంగా ఆయన వివరించడం గమనార్హం.
తనకు తన నానమ్మ ఇందిరా గాంధీ, అమ్మ సోనియా గాంధీల లక్షణాలు ఉన్న అమ్మాయిలంటే ఇష్టమని సమాధానమిచ్చారు. తనకు నానమ్మ ఇందిరా గాంధీ అంటే ప్రాణమని ఆయన అన్నారు. ఆమె తనకు రెండో తల్లిలాంటిదని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ఓ రిపోర్టర్ మధ్యలో ప్రశ్న అడిగారు. మీ నానమ్మ లాంటి లక్షణాలున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? అంటూ ఆయన ప్రశ్నించాడు.
దీంతో చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారంటూ రిపోర్టర్ ను కొనియాడాడు. తాను నానమ్మ, అమ్మ ఇద్దరి లక్షణాలున్న మహిళలను ఇష్టపడతానని పేర్కొన్నారు.