విశాఖపట్నం: నగరంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన కత్తిపోట్ల దాడి తీవ్ర కలకలం రేపింది. ఇసుకతోట రామాలయం ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు సంతోష్, వెంకటేశ్లపై రౌడీ షీటర్ పల్లా అనిల్ కుమార్ దాడికి దిగాడు. ఈ దాడిలో సంతోష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.