GNTR: తాడికొండ సీఐ సేవలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఉగాది పండుగ సందర్భంగా ‘ఉత్తమ సేవా పతకం’ వరించింది. వృత్తిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఈ అధికారి ఖాతాలో ఇప్పటికే 250 అవార్డులు ఉండటం విశేషం. గతంలోనే ఇండియన్ పోలీస్ మెడల్, సీఎం శౌర్య అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న ఆయన, క్లిష్టమైన కేసులను ఛేదించడంలో తనదైన ముద్ర వేశారు.