సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో వెలసిన దేవస్థానములలో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, హోమము నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి ఎన్.రఘువీరా దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.