రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కర్ణాటకలో నిన్న జరిగిన యాత్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ స్థానిక నేతలు, ఓ బాలుడితో కలిసి పుష్ అప్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా రోడ్డుపైనే రాహుల్ పుషప్స్ తీశారు.
ఈ వీడియో చూసిన కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా రాహుల్ ఒక్కరే సరిగ్గా పుషప్స్ తీశారని ….మిగతా వారు సగం సగం అంటూ కామెంట్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు మై పీఎం, నెక్ట్స్ ఏంటని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది రాహుల్ చక్కగా ఎక్సర్ సైజ్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. రాహుల్ గాంధీ పుష్ అప్ ఛాలెంజ్‌ని స్వీకరించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఓ సారి తమిళనాడులో ఓ విద్యార్థి సవాల్‌ని స్వీకరించారు.