వడ్డీ ఇవ్వలేదని మహిళను నగ్నంగా ఊరేగించి ఆమె నోట్ల మూత్రం పోయించిన సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన ఆరుగురిని పోలీసులు అరెస్ట చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు తమిళనాడులో ఇది కీలక పరిణామం. చెన్నైలో అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
చంద్రునిపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మోడ్ లోనే ఉన్నాయి. దీంతో చంద్రయాన్3 నుంచి ఇస్రోకు సిగ్నల్స్ రావడం లేదు. అయితే చంద్రునిపై మరో 5 రోజులు మాత్రమే వెలుగు ఉంటుంది. ఈ ఐదు రోజులే మిగిలి ఉండటంతో ల్యాండర్, రోవర్ సిగ్నల్స్ కోసం ఇస్రో ఎంతగానో ఎదురుచూస్తోంది.
ఢిల్లీ మెట్రో కోచ్‌లో యువతీ, యువకుడు ముద్దుపెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఏడాదిలో చార్‌ధామ్ యాత్రకు సుమారుగా 42 లక్షల మంది వెళ్లారు. అయితే అనారోగ్య సమస్యలు రావడం, బండరాళ్లు పడటంతో సుమారు 200 మంది వరకూ మరణించినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది.
వచ్చే ఆరు నెలల్లో దేశంలో హై స్పీడ్ రైలు పరుగులు పెడుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. హై స్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం క్షణాల్లో పూర్తవుతుందన్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా తమిళనాడులో అరుణ్ కుమార్ అనే వ్యక్తి బురఖా ధరించి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలైంది. ముస్లిమ్స్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేసి అరుణ్‌ను అరెస్ట్ చేశారు.
దేశంలో ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీటిని సెప్టెంబరు 24న 11 రాష్ట్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఆరంభించారు.
డాటర్స్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాల్గవ ఆదివారం జరుపుకుంటాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డాటర్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే భారత్‌లో దేవతలను పూజించినా..పలు చోట్ల ఇప్పటికే ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూతుళ్లు కొడుకుల కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ యువతి స్కూటీపై జర్నీ చేశారు. ఆ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ ఎందుకు అలా ప్రయాణించారు? మ్యాటర్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి చేరుకున్నారు. రాజతలాబ్‌లో నిర్మించనున్న కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన అనంతరం, సంపూర్ణానంద విశ్వవిద్యాలయంలో నారీ శక్తి వందన్ అభినందన కార్యక్రమంలో ప్రసంగించారు.
టికెట్ లేకుండా మెట్రోలో జర్నీ చేస్తానని చాలెంజ్ చేసి.. చివరికీ జర్నీ చేశాడు ఓ యూట్యూబర్. నెటిజన్లు మాత్రం అతనిని ఏకీపారేస్తున్నారు.
రేపు 9 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ రైళ్లు 11 రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను కలపనున్నాయని, అధునాతన భద్రతతో వేగవంతమైన ప్రయాణాన్ని ఇవి అందించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
అవయవదానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ఈ నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందన్నారు.
వచ్చే నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్టోబర్ నెలలో బ్యాంకులకు సుమారు 15 రోజులు సెలవులున్నాయి. అయితే దాదాపు నెలలో సగం రోజులు మాత్రమే బ్యాంకు సర్వీసులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఎందుకనేది ఇప్పుడు చుద్దాం.