»Prime Minister Modi Launched 9 Bharat Trains On September 24th 2023
Modi: 9 వందే భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించిన ప్రధాని మోడీ
దేశంలో ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీటిని సెప్టెంబరు 24న 11 రాష్ట్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఆరంభించారు.
Prime Minister Modi launched 9 Bharat trains on september 24th 2023
చాలా రోజు తర్వాత మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబరు 24న 11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఈ తొమ్మిది రైళ్లు మతపరమైన, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తాయని ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు. తాజాగా ప్రారంభించిన రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ ఉన్నాయి.
9 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు:
-హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్
-విజయవాడ – చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్ప్రెస్
-ఉదయపూర్ – జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్
-తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్
-పాట్నా – హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్
-కాసరగోడ్ – తిరువనంతపురం వందే భారత్ ఎక్స్ప్రెస్
-రూర్కెలా – భువనేశ్వర్ – పూరీ వందే భారత్ ఎక్స్ప్రెస్
-రాంచీ – హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్
-జామ్నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్
ఈ వందే భారత్ రైళ్లు కవాచ్ సాంకేతికతతో సహా అత్యున్నత స్థాయి సౌకర్యాలతో, అత్యాధునిక భద్రతా చర్యలను కలిగి ఉన్నాయి. ఈ ట్రైన్స్ ప్రయాణికులు, వ్యాపార ప్రయాణికులు, విద్యార్థులు, పర్యాటకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తాయని అధికారులు భావిస్తున్నారు.