వడ్డీ ఇవ్వలేదని మహిళను నగ్నంగా ఊరేగించి ఆమె నోట్ల మూత్రం పోయించిన సంఘటన బీహార్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన ఆరుగురిని పోలీసులు అరెస్ట చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వడ్డీ వ్యాపారుల వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వడ్డీలు చెల్లించని వారిపట్ల విచక్షణా రహితంగా ప్రవర్తిస్తూ వారిని మానసికంగా బాధపెడుతున్నారు. తాజాగా ఓ వడ్డీ వ్యాపారి వికృత చర్యలకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. అదనపు వడ్డీ చెల్లించలేదని ఓ మహిళను వడ్డీ వ్యాపారి నగ్నంగా ఊరేగించి ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా మోసింపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు..మోసింపూర్ గ్రామానికి చెందిన ప్రమోద్ సింగ్ వద్ద ఆ గ్రామానికి చెందిన వ్యక్తి రూ.1500 అప్పుగా తీసుకుని సమయానికి అసలుతో సహా వడ్డీని చెల్లించాడు. అయితే నగదుకు అదనపు వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ ఆ వ్యక్తిని బెదిరించాడు. ఆ వ్యక్తి భార్య అందుకు ఒప్పుకోలేదు. దీంతో ప్రమోద్ సింగ్ కోపంతో ఊగిపోయాడు.
బాధితుడి ఇంటికి వెళ్లిన ప్రమోద్ తన అనుచరులతో కలిసి బాధితుడి భార్యను బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించారు. అంతటి ఆగకుండా ఆమె నోట్లో మూత్రం పోయించి హింసించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రమోద్ సింగ్తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.