»Did The Vikram Lander Die On The Moon These Are The Things That Isro Said
ISRO: చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ చనిపోయిందా? ఇస్రో చెప్పిన విషయాలివే
చంద్రునిపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మోడ్ లోనే ఉన్నాయి. దీంతో చంద్రయాన్3 నుంచి ఇస్రోకు సిగ్నల్స్ రావడం లేదు. అయితే చంద్రునిపై మరో 5 రోజులు మాత్రమే వెలుగు ఉంటుంది. ఈ ఐదు రోజులే మిగిలి ఉండటంతో ల్యాండర్, రోవర్ సిగ్నల్స్ కోసం ఇస్రో ఎంతగానో ఎదురుచూస్తోంది.
చంద్రయాన్-3 (Chandrayan3) ప్రయోగం భారత చరిత్రలోనే ఓ అద్భుతం. ప్రపంచ దేశాలకు సాధ్యం కానివిధంగా చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ఇస్రో (ISRO) చంద్రయాన్3 మిషన్‌ని పంపింది. నెల రోజుల క్రితం జాబిల్లిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు చంద్రుడిపై పలు పరిశోధనలు చేసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు విలువైన సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో చంద్రుడిపై సూర్యాస్తమయం అవ్వడంతో ఆ రెండూ స్లీప్ మోడ్ లోకి వెళ్లాయి.
ISRO's plan was to attempt to reactivate Vikram and Pragyan today evening, but due to some reasons they will not do it today and will attempt tomorrow.
అయితే ఇటీవలే చంద్రుడిపై సూర్యోదయం అవ్వడంతో విక్రమ్ ల్యాండర్ (Vikram Lander), ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) రెండూ మేల్కొంటాయని ఇస్రో భావించింది. అయితే ఇప్పటి వరకూ వాటి నుంచి ఎటువంటి సిగ్నల్స్ రాలేదు. అవి తిరిగి ఛార్జ్ అయితే మరో 14 రోజుల పాటు చంద్రుడిపై పలు రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉంది. అయితే నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్, రోవర్‌తో కమ్యూనికేట్ అయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వాటి నుంచి సంకేతాలు ఇప్పటికీ రావడం లేదని ఇస్రో చెబుతోంది.
సెప్టెంబర్ 30న చంద్రుడిపై సూర్యాస్తమయం కానుంది. దీంతో మరో ఐదు రోజులు మాత్రమే ఇస్రో (ISRO)కు టైమ్ ఉంది. ఆ తర్వాత సిగ్నల్స్ ఉండవు. అందుకే శివశక్తి పాయింట్ వద్ద నిద్రావస్థలో ఉన్న ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కొంటాయని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రునిపై మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యంత శీతల పరిస్థితులకు గురైన ల్యాండర్, రోవర్ 22వ తేదినే మేల్కోవాలి. కానీ అలా జరగలేదు.
ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) చనిపోయిందా? అంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. శివశక్తి పాయింట్ నుంచి రోవర్ 100 మీటర్లకు పైగా ప్రయాణం చేసింది. చంద్రునిపై సల్ఫర్, ఇనుము, ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని గుర్తించింది. అక్కడి టెంపరేచర్ వివరాలను కూడా చెప్పింది. ఒకవేళ ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కొంటే చంద్రుడికి సంబంధించిన మరింత సమాచారం ఇస్రోకు తెలియనుంది.