»High Speed Train Good News For Railway Passengers First High Speed Train To Be Launched In 6 Months
High Speed Train: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..6 నెలల్లో పట్టాలెక్కనున్న తొలి హై స్పీడ్ రైలు
వచ్చే ఆరు నెలల్లో దేశంలో హై స్పీడ్ రైలు పరుగులు పెడుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. హై స్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం క్షణాల్లో పూర్తవుతుందన్నారు.
రైళ్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అప్పట్లో పొగ బండ్ల దగ్గరి నుంచి తాజాగా అందుబాటులోకి రానున్న హై స్పీడ్ల రైళ్ల వరకూ చరిత్ర సుదీర్ఘమైందని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న హైస్పీడ్ రైళ్లు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ హై స్పీడ్ రైళ్ల సర్వీసుల గురించి కీలక విషయాలను వెల్లడించారు. దేశంలోనే తొలి హైస్పీడ్ ట్రైన్ మరో 6 నెలల్లో అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ లోని సనంద్‌లో సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
ఈ హై స్పీడ్ రైళ్లు అత్యాధునిక టెక్నాలజీతో నడుస్తాయని, సుదూర ప్రాంతాలను సైతం క్షణాల్లోనే చేరుకునే విధంగా వీటిని రూపొందించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ హై స్పీడ్ రైళ్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందన్నారు. అందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.