»Tamil Nadu Aiadmk Good Bye To Bjp Party Ranks In Confusion
AIADMK: బీజేపీకి అన్నాడీఎంకే గుడ్ బై.. అయోమయంలో పార్టీ శ్రేణులు
బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు తమిళనాడులో ఇది కీలక పరిణామం. చెన్నైలో అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Tamil Nadu, AIADMK good bye to BJP.. Party ranks in confusion
AIADMK: వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడులో రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు బీజేపీ అన్నాడీఎంకే(AIADMK) పార్టీలు కలిసి ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్డీయే(NDA) కూటమి నుంచి అన్నాడీఎంకే పార్టీ తప్పుకున్నట్లు పేర్కొంది. ఎన్డీయే, బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునస్వామి ప్రకటించారు. గత కొంత కాలంగా తమిళనాడులోని బీజేపీ, అన్నాడీఎంకే నేతల మధ్య కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నాయి. అవి తారా స్థాయికి చేరడంతో AIADMK తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై అన్నాడీఎంకేశ్రేణులు పార్టీ చేసుకుంటుండగా.. బీజేపీ నేతలు మాత్రం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.