ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత.. మాస్టర్ కాంబోని రిపీట్ చేస్తూ.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో.. లియో సినిమా పై భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా రీమేక్ అని అనే న్యూస్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది.
ఖైదీ తర్వాత లోకేష్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. కానీ ఈ రెండు సినిమాల మధ్యలో విజయ్‌తో చేసిన మాస్టర్ సినిమా మాత్రం లోకేష్ యూనివర్స్ కాదు. దీంతో లియో సినిమాను లోకేష్ యూనివర్స్‌లో భాగం చేస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు దళపతి ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు బయటికొచ్చిన లియో ప్రమోషనల్ కంటెంట్.. ఇది సోలో సినిమా అనే చెబుతోంది. ఇక ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే న్యూస్ వైరల్‌గా మారింది.
దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతున్న లియో సినిమాకు.. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సైట్స్‌లో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ వైరల్‌గా మారింది. ఈ సినిమా హాలీవుడ్ ‘ఏ హిస్టరీ అఫ్ వైలెన్స్’ మూవీకి దగ్గరి పోలికలు ఉన్నట్టు తెలుస్తోంది.
2005లో వచ్చిన హాలీవుడ్ సినిమాల్లో ‘ఏ హిస్టరీ అఫ్ వైలెన్స్’ను గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా చెబుతారు. ఈ సినిమా కథ ప్రకారం.. హీరో స్థానికంగా ఓ రెస్టారెంట్ నడుపుతుంటాడు. అలాంటి సమయంలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో హీరోలోని గ్యాంగ్‌స్టర్ బయటికొస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎదురైన సంఘటనలే మిగతా కథ. ఇప్పుడు లియోలో బుకింగ్స్‌లో కూడా ఇదే లైన్ ఉంది. దీంతో లియో ‘ఏ హిస్టరీ అఫ్ వైలెన్స్’కి అఫీషియల్ రిమేక్‌గా తెరకెక్కిందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. లియో ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.