మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మళ్లీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వరసగా ఫెయిల్యూర్స్ ఎదురౌతున్నా.. అవేమి పట్టించుకోకుండా.. హిట్ కొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే… ఇటీవల ఆయన తన కొత్త సినిమాలోని ఓ డైలాగ్ ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాజకీయాల గురించి టాపిక్ ఉండటంతో… అది కాస్త వైరల్ గా మారింది. అయితే… ఆ ట్వీట్ ఎఫెక్ట్ అందరికన్నా… కాంగ్రెస్ పైనే ఎక్కువగ...
కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిని చేపట్టడానికి… రాహుల్ గాంధీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ బాధ్యతలు ఎవరు చేపడతారు అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరూ రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవి చేపడితే బాగుంటుందని కోరుకుంటున్నప్పటికీ… ఆయన సముఖంగా లేకపోవడంతో.. ఇతరుల పేర్లు వినపడుతున్నాయి. ఎక్కువగా… రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు ఎక్కువగా వినపడుతుండటం గమనార్హం. ఈ క్రమ...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసుకుందుకు విశ్వప్రయత్నాలే చేస్తోంది. దీనిలో భాగంగా వారు విభిన్న శైలిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మూస పద్దతిలో అన్ని పార్టీల మాదిరి కాకుండా… ప్రజలను ఆకర్షించడానికి ముందు… సెలబ్రెటీలను ఆకర్షించే పని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్, నితిన్ లను కలవగా,… ప్రభాస్ ని కూడా కలవనున్నట్లు వార్తలు వచ్చాయ...
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అమిత్ షా… తన కుమారుడికి అత్యున్నమైన పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించననున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. బీసీసీఐ రాజ్యంగ సవరణకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం అనుమతి ఇవ్వడంతో జై షా, గంగూలీలు తమ పదవుల్లో కొనసాగేంద...
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లఖ్‌నవూలోని దిల్‌కుషా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గోడ శిథిలాల కింద చిక్కుకు...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఆ రాష్ట్రంలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ కాస్త క్రేజ్ ఉందనే చెప్పాలి. ఆయన కూడా… తన పార్టీని కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా.. ఇతర పార్టీల్లోనూ విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ముందుగా గుజరాత్ పై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనార్హం. త్వరలో అక్కడ జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేయనుంది. ఈ క్రమంలో ఆయన ఇప్పటి నుంచే అక్కడి ప్రజలతో మమేకం కావడానికి ప...
ఇక నుంచి రైలులో ప్రయాణించేవారికి ఉచితంగా మీల్స్ అందించనున్నామని భారత రైల్వే శాఖ పేర్కొంది. రాజధాని, శతాబ్ధి, దరంతో వంటి ప్రీమియం ట్రైన్స్లో ఫ్రీ మీల్స్ అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కానీ… కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టింది. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే…రైలు.. 2 గంటలకు మించి ఆలస్యమైతేనే ప్రయాణికులకు ఫ్రీ మీల్స్ ఇస్తామని చెప్పడం గమనార్హం. ఆలస్యానికి కారణమేదైనా సరే.. ఉచితంగా భోజనం కల...
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు.. దాని అర్థమేంటో తెలుసా.. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. అయితే.. ప్రస్తుత రోజుల్లో ఈ మాటను ఎవరూ అలా భావించడం లేదు. ఎందుకంటే… ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఏం చేస్తే డబ్బు వస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ.. ఓ మనిషి ప్రాణాలు కాపాడాలి అనే ఆలోచన చాలా మందిలో ఉండటం లేదు. అయితే.. ఇలాంటి రోజుల్లో కూడా.. తమ కన్నా&...