ఇక నుంచి రైలులో ప్రయాణించేవారికి ఉచితంగా మీల్స్ అందించనున్నామని భారత రైల్వే శాఖ పేర్కొంది. రాజధాని, శతాబ్ధి, దరంతో వంటి ప్రీమియం ట్రైన్స్‌లో ఫ్రీ మీల్స్ అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కానీ… కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టింది. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే…రైలు.. 2 గంటలకు మించి ఆలస్యమైతేనే ప్రయాణికులకు ఫ్రీ మీల్స్ ఇస్తామని చెప్పడం గమనార్హం. ఆలస్యానికి కారణమేదైనా సరే.. ఉచితంగా భోజనం కల్పిస్తామని ప్రకటించింది.
1999లో ఐఆర్సీసీటీ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి రైళ్లల్లో భోజనాలకు సంబంధించిన అన్నింటినీ ఐఆర్సీటీసీ చూసుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు కృషిచేస్తోంది. కొత్త కిచెన్లను ఏర్పాటు చేసి, భోజనంలో నాణ్యతను పెంచేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది.
ఇక ప్రయాణాల సమయంలో రైళ్లల్లో మెనూను కూడా పెంచింది ఐఆర్సీటీసీ. ప్రయాణికులకు నాణ్యమైన భోజనాన్ని కల్పిస్తోంది. ఇక మీల్స్ ఇచ్చే ట్రేలను బయోడీగ్రేడబుల్ మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. ఎయిర్‌టైట్ కవర్స్‌లో పెట్టి ప్రయాణికులకు ఇస్తున్నారు.