ఢిల్లీ మెట్రో (Delhi Metro) రెండు, మూడు రోజులకొకసారి సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతున్నానే ఉన్నాయి. యువ ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. నిత్యం లక్షలాది మందికి ప్రధాన రవాణా సాధనం అయిన ఢిల్లీ మెట్రోలో.. ఇప్పటికే ఎన్నో ప్రేమ జంట (Love couple)ల శృంగార చేష్టలు వెలుగు చూశాయి.వెకిలి చేష్టలు, విచ్చలవిడి రొమాన్స్, మహిళను చూస్తూ హస్త ప్రయోగం ఇలా వికృత చేష్టలన్నింటికీ ఢిల్లీ మెట్రో కేరాఫ్‌గా మారిపోయింది. ప్రక్క ప్రయాణికులు అభ్యంతర పెడుతున్నా కానీ, ఏ మాత్రం పట్టింపు లేకుండా బరితెగించి, అందరి ముందే ఏకాంత చేష్టలతో అసౌకర్యానికి కారణమవుతున్నారు.
తాజాగా మరో ప్రేమ జంట మెట్రో కోచ్ (Metro Coach) లో కౌగిలించుకుని, ముద్ధులాడుకోవడం వెలుగు చూసింది. తోటి ప్రయాణికుల్లో ఒకరు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆనంద్ విహార్ (Anand Vihar) మెట్రో స్టేషన్ సమీపంలో ఇది చోటు చేసుకుంది. దీనిపై తోటి ప్రయాణికులు, నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రయాణికులు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడొద్దంటూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పదే పదే కోరుతోంది. కానీ, కేసులు నమోదు చేయడం, తదితర కఠిన చర్యల్లేకపోవడంతో ప్రేమ జంటలకు బెదురు లేకుండా పోయింది.
ప్రేమ గుడ్డిది కానీ, తోటి ప్రజలు కాదనే విషయాన్ని మరిచినట్టున్నారంటూ ఓ యూజర్ కామెంట్ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరో యూజర్ (User) అయితే ప్రేమ జంటకు మద్దతుగా కామెంట్ చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వారిలో వారే ముద్దు పెట్టుకుంటే తప్పు ఏముంది? ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం తప్ప మీకు వేరే పని లేదా? అంటూ నిలదీయడం గమనార్హం. నలుగురూ చూస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా యువ జంటలు సన్నిహితంగా ఉండటం.. బహిరంగంగానే రొమాన్స్(Romance)లో ముగినిపోతున్నారని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు